ఆదిలాబాద్ : ఇటీవల చిన్నారులు, యువకులు చిన్న చిన్న విషయాలకు మనస్తానికి గురవుతున్నారు. క్షణికావేశంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నారు. తల్లిదండ్రులు మందలించారనే కోపంతో ఏదైనా చేయమడానికి వెనుకాడటం లేదు. చిన్న విషయాలకే ఆగ్రహానికి లోనై ఇంటి నుంచి పారిపోవడం, లేదా క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడటం లాంటి ఘటనలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనలు రోజూ ఎక్కడో ఒకచోట జరుగుతూనే ఉన్నాయి. అయితే తాజాగా అలాంటి ఘటన మరొకటి చోటుచేసుకుంది.
ఇంట్లో గొడవపడి ఇద్దరు చిన్నారులు అలిగి బయటకు వెళ్లారు. తల్లిదండ్రుల మీద కోపంతో ట్రైన్ ఎక్కి ఢిల్లీ వెళుతున్నారు. అయితే పోలీసులు పిల్లల ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. ఈ ఘటన తెలంగాణలో చోటుచేసుకుంది. ఇంట్లో చిన్న గొడవ జరగడంతో ఇద్దరు చిన్నారులు ఇంటి నుంచి బయటకు వచ్చారు. ఆగ్రహంతో ఉన్న ఇద్దరు చిన్నారులు.. ట్రైన్ ఎక్కి హైదారాబాద్ నుండి ఢిల్లీ వెళుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు.. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి పిల్లల కోసం అన్ని రైల్వే స్టేషన్లలో గాలింపు చర్యలు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా మంచిర్యాల రైల్వే స్టేషన్ లో చిన్నారులను పట్టుకున్నారు.
అనంతరం తల్లిదండ్రులకు అప్పగించేందుకు పిల్లలను మంచిర్యాల నుంచి హైదరాబాద్‌కు బస్సులో పంపించారు. పారిపోయిన పిల్లలు దొరకడంతో తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు. పిల్లలను పట్టుకుని అప్పగించినందుకు పోలీసులకు ధన్యవాదాలు చెబుతున్నారు. ఇంట్లో చిన్న గొడవ జరిగి కోపంలో పిల్లలు పారిపోయినట్లు కుటుంబసభ్యులు చెబుతన్నారు. పోలీసులు తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకోవాలని సూచించారు.