AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న హైదరాబాద్‌

హైదరాబాద్‌ లో ఉప్పల్ స్టేడియం వేదికగా రాజస్థాన్​ రాయల్స్ తో జరుగుతోన్న మ్యాచ్ లో సన్ రైజర్స్​ హైదరాబాద్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. కొత్త కెప్టెన్ ఐదెన్ మార్‌క్రమ్‌ తొలి మ్యాచ్‌కు అందుబాటులో లేకపోవడంతో భువనేశ్వర్‌ కుమార్‌ నాయకత్వ బాధ్యతలు చేపట్టాడు.

హోమ్ గ్రౌండ్లో సత్తా చాటలని సన్ రైజర్స్ భావిస్తోంది. మరోవైపు సంజూ శాంసన్‌ సారథ్యంలోని రాజస్థాన్‌ మరోసారి తన ఆధిపత్యం కొనసాగించాలని భావిస్తోంది. మరికొద్దిసేపట్లో మ్యాచ్ స్టార్ట్ కానుంది. కాగా మొత్తం ఐపీఎల్లో ఇప్పటివరకు సన్ రైజర్స్, రాజస్తాన్ జట్ల మధ్య 16 మ్యాచ్‌లు జరగగా చెరో ఎనిమిది మ్యాచ్ లు గెలిచి సమానంగా ఉన్నాయి.

సన్‌రైజర్స్‌ జట్టు : మయాంక్‌ అగర్వాల్‌, అభిషేక్‌ శర్మ, రాహుల్‌ త్రిపాఠి, బ్రూక్‌, వాషింగ్టన్‌ సుందర్‌, గ్లెన్‌ ఫిలిప్స్‌(వికెట్‌ కీపర్‌), ఉమ్రాన్‌ మాలిక్‌, ఆదిల్‌ రషీద్‌, భువనేశ్వర్‌(కెప్టెన్‌),నటరాజన్‌, ఫారూకీ

రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు : జైస్వాల్‌, జోస్‌ బట్లర్‌, సంజూ శాంసన్‌(కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌),పడిక్కల్‌, రియాన్‌ పరాగ్‌, హెట్‌మెయిర్‌, అశ్విన్‌, జేసన్‌ హోల్డర్‌, ట్రెంట్‌ బౌల్ట్‌, కేఎం అసిఫ్‌, చాహల్‌

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10