హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ ఏప్రిల్ 8న హైదరాబాద్‌కు వస్తున్నారని, ఆయన కొన్ని మౌలికవసతుల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారని కేంద్ర టూరిజం శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి శనివారం తెలిపారు. మోడీ తన పర్యటన సందర్భంగా హైదరాబాద్ నుంచి తిరుపతికి వందే భారత్ రైలుకు జెండా ఊపనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నడిచే రెండో వందే భారత్ ట్రెయిన్ ఇది. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆ రోజున సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఏర్పాట్లు చేయనున్నామని కిషన్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్, తిరుపతి మధ్య ఈ రైలును కేటాయించినందుకు కిషన్ రెడ్డి ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. సాధారణంగా హైదరాబాద్, తిరుపతి మధ్య నడిచే రైళ్లకు 11 గంటలకుపైగా పడుతుంది. అయితే వందే భారత్ రైలు ప్రయాణం తొమ్మిది గంటలకన్నా తక్కువ కాలంలోనే ముగుస్తుందని కిషన్ రెడ్డి వివరించారు.