AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

టీఎస్‌పీఎస్సీ బోర్డు సభ్యులకు సిట్ నోటీసులు

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో సిట్ విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో ఇప్పటివరకు నిందితులను పూర్తి స్థాయిలో విచారించలేదు అధికారలు. అంతేకాదు టీఎస్‌పీఎస్సీ బోర్టు అధికారులను కూడా ఇప్పటి వరకూ సిట్ విచారించలేదు. ఈ నేపథ్యంలో బోర్డు మెంబర్లను విచారించాలని సిట్‌ నిర్ణయించింది. బోర్డులో ఔట్ సోర్సింగ్ నియామకాలపై దృష్టి సారించారు సిట్ అధికారులు. ఈ క్రమంలో మార్చి 31వ తేదీ శుక్రవారం బోర్డు సెక్రెటరీ, సభ్యులకు సిట్ నోటీసులు జారీ చేసింది. ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల నియామకంపై టీఎస్‌పీఎస్సీ మెంబర్లను విచారించనుంది. ఈ విచారణలో ఆరుగురు బోర్డు సభ్యుల స్టేట్‌మెంట్‌ రికార్డు చేయనున్నారు సిట్ అధికారులు. బోర్డు సభ్యులు సుమిత్రా ఆనంద్ తనోబా, కరమ రవిందర్ రెడ్డి, ఆర్ సత్యనారయణ, రమావత్ ధన్ సింగ్, బండి లింగారెడ్డి, కోట్ల అరుణ కుమారి లను సిట్ విచారించనుంది.

మరో వైపు పేపర్ లీక్ కేసులో సిట్ ముగ్గురు నిందితులను శమీమ్, సురేష్, రమేష్ లను మూడోరోజు విచారిస్తోంది. మార్చి 30న ఈ ముగ్గురు నిందితుల ఇళ్లలో పోలీసులు సోదాలు నిర్వహించారు సిట్ అధికారులు. ఎల్బీనగర్, ఉప్పల్, సైదాబాద్ లో నిందితులను తీసుకెళ్లి విచారించారు. గ్రూప్ 1 కి సంబంధించిన మెటీరియల్ స్వాధీనం చేసుకున్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10