ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు బాలురు చెరువులో పడి మృతిచెందిన ఘటన వరంగల్ నగరంలో చోటు చేసుకుంది. నగరంలోని 14వ డివిజన్ ఏనుమాముల పరిధిలోని చాకలి ఐలమ్మ నగర్ లో గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్న లక్ష్మీబాయి, లకన్ సింగ్ దంపతులు. లకన్ సింగ్ మార్కెట్లో హమాలీ పని చేస్తుండగా, లక్ష్మీబాయి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. శుక్రవారం ఉదయం అన్నదమ్ములిద్దరూ బహిర్భూమి కోసమై కోట చెరువు వద్దకు వెళ్లి, తిరిగి రాని లోకాలకు పోయారు. ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతిచెందిన ఘటన తీవ్రంగా కలిచి వేసింది.