AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

వైఎస్ షర్మిల టీఎస్‌పీఎస్సీ కార్యాలయం ముట్టడి.. ఉద్రిక్తం

టీఎస్‌పీఎస్సీ ఆఫీస్ ముట్టడికి వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రయత్నించారు. వైఎస్సార్‌టీపీ కార్యకర్తలతో కలిసి కార్యాలయం ముట్టడికి యత్నించారు. కార్యాలయం గేటు ముందు రోడ్డుపై బైఠాయించి పేపర్ లీక్‌ వ్యవహారంపై నిరసన తెలిపారు. షర్మిల ఆందోళనతో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకునే అవకాశం ఉండటంతో షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు.

షర్మిలను బలవంతంగా పోలీస్ వెహికల్‌లోకి ఎక్కించారు. ఆమెను పోలీస్ స్టేషన్‌కు తరలించి కాసేపటి తర్వాత విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా పేపర్ లీకేజీపై షర్మిల స్పందించారు. పేపర్ లీక్ కేసులో పెద్దవాళ్లను తప్పిస్తున్నారని, చిన్నవాళ్లను దోషులుగా చిత్రీకరిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఆందోళన అనగానే హౌస్ అరెస్ట్‌లు చేస్తున్నారని, తనకు లుకౌట్ నోటీసులు ఇచ్చారని షర్మిల తెలిపారు. లుకౌట్ నోటీసులు ఇవ్వడానికి తానేమన్నా క్రిమినల్‌నా? అంటూ షర్మిల ప్రశ్నించారు.

తన ఇంటి చుట్టూ పోలీసులు భారీగా మోహరించారని, ప్రజాస్వామ్యపరంగా నిరసనలు చేయనీయకుండా గొంతు నొక్కేస్తున్నారని షర్మిల విమర్శించారు. తాను బయటకు వెళ్లాలంటేనే ఇతర కారణాలు చూపించి హౌస్ అరెస్ట్ చేస్తున్నారని, నిరుద్యోగులకు న్యాయం చేయాలని నిన్న రాత్రి ఇంటి నుంచి బయటకు వచ్చానని షర్మిల అన్నారు. ఒక హోటల్ రూంలో తలదాచుకుని ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని షర్మిల తెలిపారు. అయితే టీఎస్‌పీఎస్సీ ఆఫీస్ ముట్టడికి షర్మిల యత్నించడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. షర్మిలను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో టెన్షన్ క్రియేట్ అయింది. ఈ సందర్భంగా పోలీసులతో షర్మిల కాసేపు వాగ్వాదానికి దిగారు. అయితే పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. అలాగే పలువురు వైఎస్సార్‌టీపీ శ్రేణులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.

అరెస్టులపై షర్మిల ట్విట్టర్‌లో ఒక వీడియోను విడుదల చేశారు. ‘నిరుద్యోగుల పక్షాన కొట్లాడుతున్న నాపై LOOK OUT నోటీసులు ఇవ్వడం KCR నియంత పాలనకు నిదర్శనం. ఇప్పటికే రెండుసార్లు హౌస్ అరెస్ట్ చేశారు. ఇప్పుడు దుర్మార్గంగా LOOK OUT నోటీసులు ఇచ్చి, పోలీసులను ఉసిగొల్పుతున్నారు. TSPSC ప్రశ్నాపత్రాల కుంభకోణంలో SIT పెద్ద తలకాయలను వదిలేస్తోంది’ అని షర్మిల ఆరోపించారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10