హార్ట్ ఎటాక్‌తో 6వ తరగతి విద్యార్థిని హఠాన్మరణం..
13 ఏళ్లకే గుండె ఆగింది.. హాయిగా ఆడుతూ పాడుతూ తిరిగే బాలికకు నూరేళ్లు నిండాయి..ముద్దులొలికే బాలిక అర్ధరాత్రి బాలిక గుండెపోటుతో మృతిచెందడంతో ఊరంతా విషాదం అలుముకుంది.. ఆడుతూ పాడుతూ గడపాల్సిన పసిగుండెకు ఎంత కష్టం వచ్చిందో.. 13 ఏళ్ల పసి హృదయం ఇగ నేను కొట్టుకొను అని ఆగిపోయింది.. సాయంత్రం వరకు తోటి మిత్రులతో సరదాగా ఆడి పాడిన బాలిక గుండె హఠాత్తుగా ఆగిపోయింది.. తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయింది. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే ఆ తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చివెళ్లింది. ఈ హృదయ విదారక ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం అబ్బాయిపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని బోడ తండాలో శుక్రవారం తెల్లవారుజాము జరిగింది. స్థానికులు తెలిపిన సమాచారం ప్రకారం.. మరిపెడ మండలం బోడతాండకు చెందిన బోడ లకపతి, వసంత దంపతులకు వ్యవసాయమే జీవనాధారం. వీరికి ఇద్దరు సంతానం. కూతురు బోడ స్రవంతి స్థానికంగా ఉన్న ఓ పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది. శ్రీరామనవవి పండగ సందర్భంగా సెలవు కావడంతో గురువారం సాయంత్రం వరకు తోటి పిల్లలతో సరదాగా ఆడుకుంది. అనంతరం నానమ్మ దగ్గర నిద్రించింది.