నిజామాబాద్‌లో ఓ మెడికో ఆత్మహత్య ప్రస్తతం కలకలం రేపుతోంది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ స్టూడెంట్ సూసైడ్ చేసుకున్నాడు. సనత్ అనే ఎంబీబీఎస్ విద్యార్థి హాస్టల్ గదిలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సనత్ ప్రస్తుతం ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదవుతున్నాడు. మృతుడు సనత్‌ది పెద్దపల్లి జిల్లా కాగా.. నిజామాబాద్‌లో ఎంబీబీఎస్ చదువుతున్నాడు.
సనత్ 2020 బ్యాచ్‌కు చెందిన విద్యార్థిగా పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. సనత్ ఆత్మహత్యపై విద్యార్థులు, కాలేజీ సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. పోలీసులు ఈ ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. సనత్ ఆత్మహత్యకు పాల్పడటంపై కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. దీంతో కుటుంబసభ్యులు నిజామాబాద్‌కు చేరుకుంటున్నారు.
సనత్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పోలీసులు ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. పోస్టుమార్టం పూర్తి అయిన తర్వాత యువకుడి మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు. సనత్ మృతితో అతడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. కొడుకు మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే విద్యార్థి మృతికి కారణాలు ఏంటనేది ఇంకా బయటకు రాలేదు. పోలీసుల విచారణలో ఆత్మహత్యకు కారణాలు ఏంటనేది తెలిసే అవకాశం ఉంది. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.