AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సోషల్ మీడియాలో అసత్య ట్రోల్స్.. 20మందిపై కేసులు

రాష్ట్రంలోని ప్రజా ప్రతినిధులపై సోషల్ మీడియాలో అసత్య ట్రోల్స్ చేసిన 20 మందిపై కేసులు నమోదు చేసిన‌ట్లు సైబర్ క్రైమ్ డిసిపి స్నేహ మేహ్ర తెలిపారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో ప్రజా ప్రతినిధులపై అసత్య ప్రచారం చేస్తూ ట్రోల్ చేస్తున్న వారిపై కేసులు చేసామన్నారు. టిఆర్పి, వ్యూస్ కోసం ఇలా చేస్తున్నారని సైబర్ క్రైమ్ డిసిపి స్నేహ వివరించారు. ఎక్కువ మంది యువత ఈ ట్రోలింగ్ కి పాల్పడుతున్నారని తెలిపారు.

ఇప్పటికే 20 మంది పై కేసులు నమోదు చేసి.. 8 మందికి నోటీసులు ఇచ్చామన్నారు. ఎమ్మెల్సీ కవితపై కించపరిచే విధంగా, అభ్యుస్, వల్గర్ గా ట్రోల్ చేశారని తెలిపారు. దీంతో పాటు మహిళలపై అత్యధికంగా ట్రోల్స్ జరుగుతున్నాయని గుర్తించామన్నారు. ఎమ్మెల్సీ కవితతో పాటు మరికొంత మంది ప్రజా ప్రతినిధులపై ట్రోల్స్ జరుగుతున్నాయన్నారు. మహిళలను కించపరిచే విధంగా ట్రోలింగ్ చేస్తున్న పలు సోషల్ మీడియా నిర్వాహకులను అరెస్టు చేశామని తెలిపారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10