తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తొలిరోజు సీఐడీ విచారణ ముగిసింది. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబును సీఐడీ అధికారులు విచారించారు. తొలిరోజు 7గంటల పాటు చంద్రబాబును సీఐడీ అధికారులు ప్రశ్నించారు.
భోజనానికి గంట సమయం, నాలుగు సార్లు సీఐడీ అధికారులు బ్రేక్ ఇచ్చారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో న్యాయవాదుల సమక్షంలో చంద్రబాబును అధికారులు ప్రశ్నించారు. చంద్రబాబు స్టేట్ మెంట్ ను అధికారులు రికార్డు చేశారు. నేడు కూడా చంద్రబాబును సీఐడీ అధికారులు విచారించనున్నారు.