AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

గ్రూప్-1 పరీక్షలు రద్దు.. హైకోర్టు ఆదేశాలు..

తెలంగాణలో జూన్-11న జరిగిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలు రద్దు చేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గ్రూప్-1 పరీక్ష మళ్ళీ నిర్వహించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. జూన్-11న రెండోసారి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) గ్రూప్-1 ప్రిలిమ్స్‌ పరీక్షను నిర్వహించింది. ఈ పరీక్షను రాష్ట్రవ్యాప్తంగా 2,33,248 మంది రాసిన సంగతి తెలిసిందే.

అయితే గ్రూప్-1 రద్దు కోరుతూ హైకోర్టులో జూన్‌లో మరో పిటిషన్ దాఖలైంది. జూన్ 11న నిర్వహించిన గ్రూప్-1 పరీక్ష రద్దు చేయాలని ముగ్గురు అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అభ్యర్థుల బయోమెట్రిక్ తీసుకోకుండా, హాల్టికెట్ నంబర్, ఫొటో లేకుండానే ఓఎమ్మార్ షీట్ ఇచ్చారని ఆ ముగ్గురు పిటిషన్‌‌లో పేర్కొన్నారు. గ్రూప్-1 పరీక్ష మళ్లీ నిర్వహించాలని పిటిషన్లో కోర్టును అభ్యర్థించారు. ఈ నెల 11న గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌ పరీక్ష సాఫీగా ముగిసిన విషయం తెలిసిందే.

రాష్ట్రవ్యాప్తంగా 994 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించారు. పరీక్షకు 3,80,081 మంది దరఖాస్తు చేసుకోగా 2,33,248 మందే హాజరయ్యారు. హాజరు శాతం 61.37గా నమోదైంది. టీఎస్‌పీఎస్సీలో లీకేజీ వ్యవహారం కారణంగా ప్రిలిమ్స్‌ పరీక్షను మళ్లీ నిర్వహించింది. ఈ నేపథ్యంలో అన్ని పరీక్ష కేంద్రాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిబంధలను కఠినంగా అమలు చేశారు. గత గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షలో అభ్యర్థుల బయోమెట్రిక్‌ తీసుకోగా ఈసారి అలా చేయలేదు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10