తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే.. కీలక నేతలు సంచలన వ్యాఖ్యలు చేయటం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారుతోంది. ఇప్పుడు మంత్రి పువ్వాడ అజయ్ కూమార్ కూడా కీలక ప్రకటన చేశారు. అయితే.. వచ్చే ఎన్నికలే తనకు చివరి ఎలక్షన్ అని.. ఆ తర్వాత తాను పోటీ చేస్తానో లేదో అన్న అనుమానం వ్యక్తం చేశారు. అయితే.. ఇందుకు కారణం ఆయన రాజకీయాల్లో నుంచి తప్పుకోవటం కాదండోయ్.. మహిళా రిజర్వేషన్ బిల్లు అమల్లోకి రావటమేనటా. అయితే.. మహిళా బిల్లు అమల్లోకి వస్తే.. ఖమ్మం అసెంబ్లీ స్థానం ఒకవేళ మహిళ రిజర్వ్‌డ్ అయితే.. ఇవే తనకు చివరి ఎన్నికలు అయితయేమోనని అనుమానం వ్యక్తం చేశారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్.
ఒకవేళ ఖమ్మం స్థానం మహిళలకు రిజర్వ్ అయితే తమ ఇంట్లో నుంచి ఎవ్వరినీ నిలబెట్టనని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. పార్టీ కోసం పని చేసిన మహిళలే పోటీలో ఉంటారని మంత్రి స్పష్టం చేశారు. మహిళల కోసం మనమంత ముందు పడాలన్నారు. మంత్రి కేటిఆర్ చెప్పినట్లు తన స్థానాన్ని త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. పదవి లేకపోయినా సరే.. తాను ప్రజల మధ్యే ఉంటూ వారికి సేవ చేయటం మాత్రం కొనసాగిస్తానని చెప్పుకొచ్చారు మంత్రి పువ్వాడ.