హైదరాబాద్ సనత్ నగర్ లోని ఈఎస్ఐ ఆసుపత్రి లో ఇవాళ రాత్రి దారుణం చోటు చేసుకుంది. ఆసుపత్రి లిఫ్ట్ లో యువతిని భవనం పై అంతస్తు తీసుకెళ్ళాడు. అనంతరం నోట్లో గుడ్డలు కుక్కి యువతి పై లిఫ్ట్ ఆపరేటర్ అత్యాచారం చేశాడు. డైట్ సెక్షన్ లో ఫ్లోర్ లో ఘటన జరిగింది. తీసుకున్నారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఒక కుటుంబం వైద్యం కోసం ఈఎస్ఐ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. వారం రోజుల నుండి ఈఎస్ఐ ఆసుపత్రిలో యువతి అన్నయ్య చికిత్స తీసుకుంటున్నాడు.
యువతీ అన్నయ్య బాగోగులు చూసుకుంటుంది. అదును చూసి యువతి లిఫ్ట్ లో వస్తున్న సమయంలో లిఫ్ట్ ఆపరేటర్ పైకి తీసుకెళ్ళి నోట్లో గుడ్డలు గుక్కి అత్యాచారం చేశాడు. అక్కడ నుంచి తప్పించుకున్న ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో యువతీ. ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. యువతిపై అత్యాచారం అయినట్టు ఈఎస్ఐ హాస్పిటల్ డాక్టర్లు నిర్ధారించారు.