జి 20 సమావేశాలు ముగిసాయి. ఇప్పుడు మోడీ ప్రభుత్వం దేశ సమస్యలపై దృష్టి పెట్టాలి. ఆగస్టులో సాధారణ ప్లేట్ ఫుడ్ ధర 24 శాతం పెరిగింది నిరుద్యోగం 8 శాతానికి చేరుకుంది. యువత భవిష్యత్తు అంధకారమైంది” అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సోమవారం ట్వీట్ చేశారు. మోడీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రధాని మోడీ వాస్తవాలను దాచడానికి తీవ్రంగా యత్నిస్తున్నారని, అయితే ప్రజలు నిజాలను తెలుసుకోవాలని కోరుకుంటున్నారని అన్నారు. కుంభకోణాలు .. మోడీ ప్రభుత్వ దుర్వినియోగం అవినీతికి దారితీసింది. కాగ్ అనేక నివేదికల్లో బీజేపీని బట్టబయలు చేసింది.
‘‘మణిపూర్‌లో మళ్లీ హింస జరిగింది. హిమాచల్‌ప్రదేశ్‌లో విపత్తు సంభవించింది. అయితే అహంకారపూరిత మోడీ ప్రభుత్వం దీనిని జాతీయ విపత్తుగా ప్రకటించకుండా తప్పించుకుంటుంది’’ అని ఖర్గే ధ్వజమెత్తారు. వీటన్నింటి మధ్య మోడీ వాస్తవాలను కప్పిపుచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కానీ కానీ ప్రజలు వాస్తవాన్ని వినాలని, చూడాలని కోరుకుంటున్నారని అన్నారు. 2024లో మోడీ ప్రభుత్వ నిష్క్రమణకు ప్రజలు మార్గం సుగమం చేయడం ప్రారంభించారని మల్లికార్జున్ ఖర్గే అన్నారు.