ఆదివారం నాడు జరిగే కాంగ్రెస్ విజయభేరి సభపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. మేం ఏం చేయబోతున్నామో రేపటి సభలో చెబుతామని వెల్లడించారు. తాము చేసేదే చెబుతామని స్పష్టం చేశారు. తెలంగాణ ఇచ్చిన దేవత సోనియా గాంధీ అని కొనియాడారు. ఆమె హైదరాబాద్ వచ్చారని, ఆమెకు అందరం స్వాగతం పలికినట్టు వివరించారు. తెలంగాణ ప్రజలు రేపటి సభకు భారీగా తరలివచ్చి జయప్రదం చేయాలని కోమటిరెడ్డి పిలుపునిచ్చారు. ఇక, తెలంగాణలో కేసీఆర్ పతనం మొదలైందని, ఎన్ని హామీలు ఇచ్చినా, ఎంత ప్రయత్నించినా కేసీఆర్ పార్టీ ఓటమి నుంచి తప్పించుకోలేదని అన్నారు