తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించి.. జాతికి అంకితం చేశారు. నార్లాపూర్ పంప్ హౌస్ వద్ద స్విచ్ఛ్ ఆన్ చేసి మహా బాహుబలి పంపును ప్రారంభించారు. పంపులో నుంచి పాలనురగలు కక్కుతూ కృష్ణమ్మ ఉబికి వచ్చింది. ఈ అపురూప దృశ్యం చూసిన కేసీఆర్.. కృష్ణమ్మ తాండవం చేస్తున్నట్టుగా అనిపించిందని అభివర్ణించారు. పార్లమెంటులో తెలంగాణ ప్రకటించినప్పుడు తన హృదయం ఎంత పొంగిపోయిందో.. ఈరోజు కృష్ణమ్మ పొంగుతుంటే.. అంతే ఆనందం కలిగిందంటూ చెప్పుకొచ్చారు.