మహిళల విచారణ సందర్భంగా దర్యాప్తు సంస్థలు వ్యవహరించాల్సిన తీరుపై కవిత దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. అభిషేక్ బెనర్జీ తో పాటు నళినీ చిదంబరం, కవితలు దాఖలు చేసిన పిటిషన్‌లపై ధర్మాసనం వాదనలు విన్న అనంతరం కేసు తదుపరి విచారణను ఈనెల 26కి వాయిదా వేసింది. వచ్చే వారం కోల్‌కతా హైకోర్టు ఎలాంటి ఉత్తర్వులు ఇస్తుందో వేచి చూద్దామని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ అభిప్రాయపడ్డారు.
తదనుగుణంగా… తదుపరి ఉత్తర్వులు ఇస్తామని ధర్మాసనం పేర్కొంది. మహిళలను ఇంటి వద్దే విచారించాలంటూ, లిక్కర్ స్కాంలో కేసులో ఈడీ ఇచ్చిన సమన్లు రద్దు చేయాలని పిటిషన్‌పై విచారణ జరిగింది. ఈ కేసులో జులై 28న ఈడీకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. వెస్ట్ బెంగాల్ సీఎం మేనల్లుడు అభిషేక్ బెనర్జీ, నళిని చిదంబరం వర్సెస్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ పిటిషన్ తో కవిత వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు జత చేసింది.