టెట్ రాసేందుకు వచ్చిన ఓ గర్భిణి మృతి చెందింది. ఈ విషాద సంఘటన సంగారెడ్డి జిల్లాలోని పటాన్ చెరులో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. ఈ రోజు రాష్ట్రంలో టెట్(టీచర్ ఎలిజిబులిటీ టెస్టు) జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ పరీక్షకు ప్రిపేర్ అయిన రాధిక అనే గర్భిణి తన భర్తతో కలిసి పరీక్ష రాసేందుకు పటాన్ చెరు మండలం ఇస్నాపూర్ కు వచ్చింది. అయితే, ఆలస్యం అవుతుందేమోనని వేగంగా పరీక్ష హాల్ లోకి వెళ్లింది.
దీంతో బిపి ఎక్కువై పరీక్ష గదిలోనే సృహా కోల్పోయి పడిపోయింది. వెంటనే రాధికను పటాన్ చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రాధికను పరిశీలించిన వైద్యులు అప్పటికే చనిపోయినట్లు వెల్లడించారు. దీంతో మృతురాలి కుటుంబంలో విషాదం నెలకొంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.