జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును నేడు కలిసేందుకు అయన సతీమణి భువనేశ్వరిని ములాఖత్ దరఖాస్తును జైలు అధికారులు తిరస్కరించారు. వారానికి మూడు సార్లు ములాఖత్ ఇచ్చేందుకు అవకాశం ఉన్నా భువనేశ్వరి ధరఖాస్తును రాజమండ్రి జైలు అధికారులు తిరస్కరించారు. చంద్రబాబు అరెస్టు తరువాత రాజమండ్రిలోనే నారా భువనేశ్వరి ఉంటున్నారు. ములాఖత్ విషయంలో కూడా ప్రభుత్వం అమానవీయంగా వ్యవహరించడంపై భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనల ప్రకారం ములాఖత్ ఇచ్చేందుకు అవకాశం ఉన్నా కాదనడంపై భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు.