AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

డ్రగ్స్ కేసులో నవదీప్..! తాను కాదంటున్న టాలీవుడ్ హీరో ..

డ్రగ్స్ కేసులో మరోసారి టాలీవుడ్ హీరో నవదీప్ పేరు తెరపైకి వచ్చింది. హైదరాబాద్ మాదాపూర్ డ్రగ్స్ కేసుకి సంబంధించి హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సంచలన, షాకింగ్ విషయాలు వెల్లడించారు. ఈ కేసులో టాలీవుడ్ లో ఉన్న వారు సైతం బయటకు వస్తున్నారని ఆయన చెప్పారు. ఈ కేసులో టాలీవుడ్ హీరో నవదీప్ కూడా ఉన్నట్లు తెలిపారాయన. నవదీప్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. మాదాపూర్‌ డ్రగ్స్ కేసులో ఐదుగురిని అరెస్ట్ చేయడంతో పాటు డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నామని, నిందితుల ఫోన్లను సీజ్‌ చేశామని సీపీ సీవీ ఆనంద్ వివరించారు.

”మాదాపూర్ డ్రగ్స్ కేసులో నార్కోటిక్ విభాగం డ్రగ్స్ స్వాధీనం చేసుకుంది. ఐదుగురిని అరెస్ట్ చేశాం. మొత్తం డ్రగ్స్ బెంగుళూరు నుంచి వచ్చిందని తెలిసింది. ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసుకుని డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. వీసా గడవు ముగిసినా దేశంలో ఉన్నారు. డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న వారిలో వరంగల్ కు చెందిన వ్యక్తి ఉన్నాడని గుర్తించాం.. సోషల్ మీడియా ద్వారా డ్రగ్స్ విక్రయాలు జరుపుతున్నారు.

ఈ కేసులో మాజీ ఎంపీ కూమారుడు దేవరకొండ సురేశ్ రావుని అరెస్ట్ చేశాం. బెంగుళూరులో 18 మంది నైజీరియన్లు ఉన్నట్లు గుర్తించాము. ఈ కేసులో హీరో నవదీప్ కన్జ్యూమర్ గా ఉన్నారు. ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నారు” అని సీపీ సీవీ ఆనంద్ చెప్పారు. ఈ కేసులో నవదీప్ స్నేహితుడు రాంచంద్ ను అరెస్ట్ చేశామని, అతడు ఇచ్చిన సమాచారం ప్రకారం కన్జ్యూమర్ గా నవదీప్ ఉన్నట్టు గుర్తించామని సీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు.

మాదాపూర్ డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ ఉన్నట్లు సీపీ చెప్పడం.. సినీ పరిశ్రమలో కలకలం రేపింది. ఒక్కసారిగా ఇండస్ట్రీ వర్గాలు ఉలిక్కిపడ్డాయి. డ్రగ్స్ కేసులో తన పేరు రావడంపై నవదీప్ ట్విట్టర్ లో స్పందించారు. పోలీసులు చెబుతున్న నవదీప్ తాను కాదన్నారు. డ్రగ్స్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. నేను ఎక్కడికీ పారిపోలేదు, ఇక్కడే ఉన్నాను అన్న నవదీప్.. ఈ మేరకు ట్వీట్ చేశారు నవదీప్.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10