AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం ధర.. లేటెస్ట్ రేట్లు ఇవే..

గోల్డ్ కొనాలనుకుంటున్నారా?.. కొనుగోళ్లకు ఇది సరైన సమయం. మూడు రోజులుగా గోల్డ్ ధరలు తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్ లో కూడా గోల్డ్ ధరలు పడిపోతున్నాయి. గత నెలలో గోల్డ్, సిల్వర్ రేట్లు రికార్డు స్థాయికి చేరిన సంగతి తెలిసిందే. తర్వాత కాస్త వెనక్కి తగ్గినా.. ఈ నెలలో మాత్రం వరుసగా బంగారం ధర దిగొస్తుంది. వెండి మాత్రం కుప్పకూలుతోంది. ఇంటర్నేషనల్ మార్కెట్‌లో కూడా గోల్డ్ రేట్లు పడిపోతున్నాయి. ఇక్కడ స్పాట్ గోల్డ్ రేటు చూస్తే ఔన్సుకు 1919 డాలర్ల మార్కుకు దిగొచ్చింది. ఇదే సమయంలో స్పాట్ సిల్వర్ రేటు మాత్రం 23 డాలర్లపైన ట్రేడవుతోంది. ఇక్కడి మార్పులకు అనుగుణంగానే దేశీయ మార్కెట్లలో కూడా బంగారం, వెండి రేట్లు కూడా కదలాడుతుంటాయి. మరోవైపు డాలర్‌తో చూస్తే రూపాయి మారకం విలువ రూ.83.258 వద్ద కొనసాగుతోంది.

హైదరాబాద్‌లో బంగారం ధర
హైదరాబాద్ మార్కె్ట్‌లో బంగారం ధర పడిపోయింది. ప్రస్తుతం 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల గోల్డ్ రేటు ఇక్కడ ఒక్కరోజులోనే రూ.150 తగ్గి ప్రస్తుతం రూ. 55 వేల మార్కుకు చేరింది. అంతకుముందు రోజు కూడా 10 గ్రాములపై రూ. 150 తగ్గిన సంగతి తెలిసిందే. ఇక 24 క్యారెట్స్ బంగారం ధర రూ.160 తగ్గగా 10 గ్రాములకు ఇప్పుడు రూ. 60 వేల మార్కుకు తిరిగి చేరింది.

మరోవైపు సిల్వర్ రేట్ల విషయానికి వస్తే కూడా వరుసగా 2 రోజులు తగ్గుముఖం పట్టింది. తాజాగా రూ. 500 తగ్గగా. రేటు కిలోకు రూ.78,500 మార్కును తాకింది. 6 రోజుల వ్యవధిలో ఇక్కడ సిల్వర్ ధర రూ. 2200 మేర తగ్గింది. అంతకుముందు రేటు రూ.80 వేల మార్కు పైన ఉండటం గమనార్హం.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10