AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మాతో సంప్రదించకుండానే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలా? : మోడీకి సోనియా లేఖ

కేంద్రంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలపై కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ బుధవారం ప్రధాని నరేంద్ర మోడీకి ఒక లేఖ రాశారు. ఈ సమావేశాలలో ప్రతిపక్షాలు లేవనెత్తనున్న అంశాల సారాంశాన్ని ఆమె తన లేఖలో వివరించారు.

తమను కాని, ఇతర పార్టీలను కాని సంప్రదించకుండానే ఈ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేస్తున్నారని ఆమె తన లేఖలో తెలిపారు. సమావేశం చర్చనీయాంశాలు ఏమిటో తమకు తెలియదని ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యకలాపాల కోసమే ఐదు రోజుల సమావేశాలను కేటాయించినట్లు మాత్రం తెలిపారని ఆమె తెలిపారు. ప్రజలకు సంబంధించిన సమస్యలను, ప్రాధాన్యతలను లేవనెత్తే అవకాశం వస్తుందన్న కారణంగానే ఈ ప్రత్యేక సమావేశాలలో పాల్గొనాలని తాము భావిస్తున్నామని ఆమె పేర్కొన్నారు.

ఈ సమస్యలపై చర్చించేందుకు తగిన నిబంధనల కింద సమయాన్ని కేటాయిస్తారని ఆశిస్తున్నట్లు సోనియా గాంధీ తెలిపారు.
నిత్యావరసర వస్తువుల ధరల పెరుగుదల, పెరుగుతున్న నిరుద్యోగ సమస్య, అసమానతల పెరుగుదల, ఎంఎస్‌ఎంఇల సంక్షోభం వంటి ఆర్థిక పిరిస్థితికి సంబంధించిన అంశాలతోపాటు ఎంఎస్‌పి, ఇతర డిమాండ్లపై రైతులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అవినీతి ఆరోపణల నేపథ్యంలో అదానీ వ్యాపార గ్రూపు లావాదేవీలపై జెపిసి దర్యాప్తు ఏర్పాటు చేయాలన్న డిమాండ్ వంటి అంశాలను ప్రతిపక్షాలు ఈ ప్రత్యేక సమావేశాలలో లేవనెత్తాలని భావిస్తున్నట్లు ఆమె తన లేఖలో పేర్కొన్నారు. ఐదు రోజులపాటు జరిగే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు సెప్టెంబర్ 18న ప్రారంభం కానున్నాయి.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10