AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

జీతం రావట్లేదని పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న హోంగార్డు..

హైదరాబాద్: నగరంలోని గోషామహల్ లో జీతం రావట్లేదని ఓ హోంగార్డు ఆత్మహత్య చేసుకున్నాడు. హోంగార్డులను చిన్న చూపు చూస్తున్నారని, జీతం కోసం అడగడానికి వెళ్తే ఎఎస్ఐ నర్సింగరావు, కానిస్టేబుల్ చందు కించపరుస్తూ అవమానించారని అవేదన వ్యక్తం చేస్తూ.. చంద్రాయణగుట్ట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న రవీందర్ నిన్న(మంగళవారం) ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో రవీందర్ ను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. 67 శాతం శరీరం కాలడంతో ఐసియూలో చికిత్స అందిస్తున్నారు. రవీందర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

కాగా, ఉస్మానియాలో చికిత్స పొందుతున్న రవీందర్ ను హోంగార్డులు పరామర్శించారు. రవీందర్ కు మద్దతుగా నిలవాలని రాష్ట్ర హోంగార్డుల సంఘం నిర్ణియించింది. తమను క్రమబద్ధీకరించాలంటూ కొంతకాలంగా హోంగార్డులు ఆందోళన చేస్తున్నా.. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చట్లేదని హోంగార్డుల సంఘం పేర్కొంది.

హోంగార్డు రవీందర్ ఆత్మహత్యాయత్నం ఘటనతో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం.. ముందుగానే జీతాలు వేసింది. ప్రతీసారి పదవ తేదీన పడే జీతాలు ఈసారి ముందుగానే హోంగార్డుల ఖాతాల్లోకి వచ్చి చేరాయి. హోంగార్డ్ రవీందర్ ఆత్మహత్యాయత్నంతో రాష్ట్ర వ్యాప్తంగా హోంగార్డులకు ప్రభుత్వం త్వరితగతిన జీతాలు వేసేసింది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10