AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌.. పార్టీ వీడనున్న మాజీ ఎమ్మెల్యే

బీఆర్‌ఎస్‌లో టికెట్ల లొల్లి ఇంకా కొనసాగుతూనే ఉంది. పలు చోట్లు బీఆర్‌ఎస్ టికెట్ దక్కకపోవడంతో అనేక మంది నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమకు టికెట్ ఎందుకు ఇవ్వడం లేదంటూ కొన్ని చోట్లు నేతలు అలిగి కూర్చోగా.. వారిని బుజ్జగించే పనిలో బీఆర్ఎస్‌ నేతలు ఉన్నారు. తాజాగా కరీంనగర్ మానకొండూరులో అధికారపార్టీ బీఆర్‌ఎస్‌కు పెద్ద షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే, విప్ ఆరేపల్లి మోహన్ బీఆర్‌ఎస్‌ను వీడాలని నిర్ణయించారు.

ఈ మేరకు తన అనుచరులతో ఆరేపల్లి చర్చలు నిర్వహించారు. మానకొండూరులో సిట్టింగ్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌కు టికెట్ ఇవ్వడంపై ఆరేపల్లి తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. దీంతో పార్టీని వీడాలని నిర్ణయానికి వచ్చారు. రేపు(గురువారం) బీఆర్‌ఎస్ పార్టీకి ఆరేపల్లి మోహన్ రాజీనామా చేయనున్నారు. అయితే ఏ పార్టీలో చేరే అంశంపై త్వరలో నిర్ణయం తీసుకుంటానని, బీఆర్‌ఎస్ పార్టీ కోసం చాలా కష్టపడినట్లు మోహన్ వెల్లడించారు. మరి ఆరేపల్లి మోహన్ నిర్ణయంపై బీఆర్‌ఎస్ పెద్దలు ఎలాంటి స్టెప్ తీసుకుంటారో వేచి చూడాలి.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10