AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కలిసికట్టుగా కదులుదాం.. జోగు రామన్నను ఓడిద్దాం

కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి పిలుపు
కంది శ్రీనన్న సమక్షంలో జోరుగా చేరికలు
ఆదిలాబాద్‌: ఎమ్మెల్యే జోగు రామన్నను చిత్తుచిత్తుగా ఓడించ‌డ‌మే లక్ష్యంగా కాంగ్రెస్‌ కార్యకర్తలు, నాయకులందరూ పనిచేయాలని కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. ఆయన సమక్షంలో కాంగ్రెస్‌ లోకి చేరికలు ఊపందుకుంటున్నాయి. కేఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌లో చేరిన నాటి నుంచి పార్టీలో జోష్‌ కనబడుతోంది. ఇప్పటికే వేలాదిమంది కార్యకర్తలు ఆయన చెంతకు చేరారు. తాజాగా ఆదిలాబాద్‌ పట్టణంలోని ప్రజాసేవా భవన్‌కు పిట్టల్‌ వాడ, మహాలక్ష్మీ వాడ, చిలుకూరి లక్ష్మీనగర్‌ కాలనీలవాసులు తరలివచ్చారు. వారందరినీ సాదరంగా ఆహ్వానించిన కంది శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్‌ కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు. గడపగడప కు కాంగ్రెస్‌ మేనిఫెస్టోను చేర్చి పార్టీ గెలుపునకు కృషి చేయాలని కంది శ్రీనివాస రెడ్డి పిలుపునిచ్చారు.


జోగురామన్నను ఓడిస్తేనే ఆదిలాబాద్‌ అభివృద్ధి జరుగుతుందన్నారు. బియ్యంకార్డు కూడా ఇవ్వని జోగురామన్న ప్రజలకు ఏం చేస్తారని ప్రశ్నించారు. వృద్ధులు పింఛన్ల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారన్నారు. బీసీలకు లక్ష రూపాయల ఆర్థిక సాయం అందరికీ ఇవ్వాలని డిమాండ్‌ చేసారు. జాబితాలో లేని మిగతా బీసీ కులవృత్తి దారులు తమకు జరిగిన అన్యాయం పై నిలదీయాలన్నారు. లక్ష రూపాయల ఆర్థిక సాయానికి కూడా ముఫ్పైవేల వరకు కమీషన్‌ తీసుకుంటున్నట్టు ఆరోపించారు. కాంగ్రెస్‌ డిక్లరేషన్‌ లను ఇంటింటికీ తీసుకెళ్తే 50వేల మెజారీటీతో గెలుస్తామన్నారు. కాంగ్రెస్‌ కా హాత్‌ గరీబోంకా సాథ్‌ అని నినదించారు. కార్యక్రమంలో గిమ్మ సంతోష్‌, షకీల్‌, మీరా బాయి, సుజాత, పుండ్రు రవి కిరణ్‌రెడ్డి, మానే శంకర్‌, సంతోష్‌ రెడ్డి, బండి కిష్టన్న, అస్బాత్‌ ఖాన్‌, కర్మ, మోసిన్‌ చౌష్‌, అంజద్‌ ఖాన్‌ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10