సౌత్ లోని పలు లాంగ్వేజ్స్ అనేక భాషల్లో సంగీత దర్శకుడిగా అలరించిన ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ‘దాసి’ కారు ప్రమాదంలో మృతి చెందారు. కేరళ నుంచి చెన్నై తిరిగి వస్తున్న సమయంలో.. తిరుపూర్ జిల్లా ప్రాంతంలో బైపాస్ పై ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ప్రమాదం జరిగిన సమయంలో కారులో మ్యూజిక్ డైరెక్టర్ దాసితో పాటు మరో ముగ్గురు స్నేహితులు కూడా ఉన్నారు. ఈ నలుగురిలో ఇద్దరు అక్కడికి అక్కడే మరణించగా, మరో ఇద్దరు తీవ్ర గాయాలతో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.
కొంతకాలంగా దాసి తన స్నేహితులతో కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్లు సమాచారం. ఈక్రమంలోనే దాసి అతని స్నేహితులు మూవేంద్రన్, తమిళ్ ఆదియన్ మరియు నాగరాజ్ కలిసి కేరళలోని ఓ స్థలం గురించి చర్చెందుకు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. కారు మంచి స్పీడ్ లో ఉన్న సమయంలో.. ముందు భాగంలోని కారు టైర్ ఒక్కసారిగా పేలిపోవడంతో అదుపుతప్పి రెప్పపాటులో పక్కనే ఉన్న అడ్డుగోడను ఢీకొంది. దీంతో కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయింది.
ఇక ముందు భాగంలో కూర్చొని ఉన్న దాసి, తమిళ్ ఆదియన్ అక్కడికక్కడే మృతి చెందారు. మిగిలిన ఇద్దరు తిరుమురుగన్ బుండిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్స పొందుతున్నారు.