సినీ పరిశ్రమలో అడుగుపెట్టి 18 ఏళ్లు పూర్తవుతున్నా తమన్నా జోరు మాత్రం ఇంకా తగ్గలేదు. వరుస సినిమాలు, వెబ్ సిరీస్ లతో ఆమె చాలా బిజీగా ఉన్నారు. మరోవైపు సినీ నటుడు విజయ్ వర్మతో ఆమె ప్రేమలో ఉన్న విషయం విదితమే. ఇటీవలే వీరిద్దరూ మాల్దీవుల్లో విహారయాత్రకు వెళ్లొచ్చారు.
తాజాగా తన పెళ్లి గురించి తమన్నా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారతీయ వివాహ వ్యవస్థపై తనకు ఎంతో నమ్మకం ఉందని తెలిపారు. పెళ్లి చేసుకోవాలని కొన్నాళ్ల క్రితం అనుకున్నానని… అయితే, కెరీర్ బిజీగా మారడంతో పెళ్లి ఆలోచనకు ముగింపు పలికానని చెప్పారు. తన పెళ్లి వార్త వినాలంటే చాలా రోజులు ఎదురు చూడాల్సిందేనని తెలిపారు.