AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో రూ.50 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో మారో సారి భారీ మొత్తంలో డ్రగ్స్ దొరికాయి. సుమారు రూ. 50 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను అధికారులు పట్టుకున్నారు. సింగపూర్, ఢిల్లీ నుంచి ఈ మాదక ద్రవ్యాలను తరలిస్తున్నట్లు పక్కా సమాచారం అందడంతో ఆమేరకు తనిఖీలు నిర్వహించిన డీఆర్ఐ అధికారులు.. 5 కిలోల (5kg) కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు. నలుగురు మహిళల హ్యాండ్ బ్యాగ్ లలో ఈ కొకైన్ (COCAINE) ను గుర్తించారు. హ్యాండ్ బ్యాగ్ లలో బ్రౌన్ టేపు వేసి కిలోల మొత్తంలో డ్రగ్స్ తరలిస్తున్నారు.

మాదక ద్రవ్యాలు తరలిస్తున్న వ్యక్తులను డీఆర్ఐ అధికారులు అరెస్టు చేశారు. లావోస్ నుంచి ఢిల్లీకి.. ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. బ్యాగ్ లో కింది భాగంలో కొకైన్ నింపి తీసుకువస్తున్నారు. నలుగురు ముందస్తు సమాచారం మేరకు మహిళలను తనిఖీ చేయగా డ్రగ్స్ దొరికినట్లు డీఆర్ఐ అధికారులు తెలిపారు. లావోస్ లో వీరికి డ్రగ్స్ ఎవరు ఇచ్చారు.. హైదరాబాద్ లో ఎవరికి డెలివరీ చేయాలని వచ్చారు అనే కోణంలో అధికారులు ఆరాతీస్తున్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10