ఈ ఏడాది చివరిలో జరిగే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వాయిదా లేదని, అలాగే లోక్సభకు ముందస్తు ఎన్నికల ఆలోచన ఏదీ ప్రభుత్వానికి లేదని కేం ద్ర సమాచార ప్రసారాల మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశారు. ఆదివారంఆయ న ఓ వార్తాసంస్థకు ప్రత్యేక ఇంటర్వూ ఇచ్చారు. లోక్సభ ఎన్నికలతో పాటే అసెం బ్లీ ఎన్నికలు జరుగుతాయనే వాదన, ఈ దిశలో కేంద్రం కసరత్తు చేస్తోందనే మాట సరికాదని మంత్రి స్పష్టం చేశారు. నిర్ణీతం ప్రకారం ఎన్నికలు జరుగుతాయి. తేదీలను ముందుకు జరిపే ప్రసక్తే లేదని, ప్రధాని మోదీ దేశ ప్రజలకు తమ పదవికాలపు చివరి రోజు వరకూ సేవలు అంది స్తూ ఉంటారని ఠాకూర్ తెలిపారు.
లోక్సభ ఎన్నికలను ముందుకు కానీ లేదా వెనకకు కానీ జరిపి నిర్వహిస్తారని ప్రచారం జరుగుతోందని, అయితే ఇదంతా మీడియా ద్వారా వెలువడ్డ సృష్టి అని, లేనిది ఉన్నట్లు చూపడం అని మంత్రి వ్యాఖ్యానించారు. ఎన్నికల దశలు ఏవీ మారబోవని, అ సెంబ్లీలకు ఎన్నికలను వాయిదా వేసి వీటిని లోక్సభ ఎన్నికలతో కలిపి వచ్చే ఏడాది లోక్సభ ఎన్నికలతో నిర్వహిస్తారని, లేదా లోక్సభ ఎన్నికలను ఇప్పటి అంటే ఏడాది చివరిలో జరిగే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో కలిపి జరుపుతారనే వార్తలు వెలువడుతున్నాయి. ఈ వార్తలు తమ దృష్టికి వచ్చాయని అయితే ఇటువంటి ఆలోచన ఏదీ లేదని ఇండియాటుడేకు ఇచ్చిన ఇంటర్వూలో మంత్రి వివరించారు. ఎన్నికలపై ముందుకు వెనుకల ఊగిసలాటల అవసరం మోడీజికి లేదన్నారు. . మీడియా ఊహాగానాల ఫలితంగానే ఇటువంటి పరిస్థితి ఏర్పడిందన్నారు.మరి కేంద్రం ఈ దశలోనే ‘ఒన్ నేషన్, ఒన్ ఎలక్షన్’ ప్రతిపాదన దీనికి సంబంధించి కమిటీ తీసుకువచ్చింది కదా? అని మీడియా ప్రశ్నించగా , దీనిపై సంబంధిత భాగస్వామ్య పక్షాలన్నింటితో విస్తృత స్థాయి సంప్రదింపులు ఉంటాయని , ఇందుకే కమిటీ ఏర్పాటు అయిందని మంత్రి తెలిపారు. ఈ కమిటీలో కాంగ్రెస్ సభాపక్ష నేత అధీర్ రంజన్ కూడా పాలుపంచుకోవాలని తాము కోరుతున్నామని చెప్పారు. ఆయన పేరును కూడా కమిటీలో చేర్చారని గుర్తు చేశారు. ప్రతిపక్షాన్ని కూడా కమిటీలో చేర్చడం మోదీ ప్రభుత్వ పెద్ద మనస్సు అన్నారు.