బిగ్ బాస్ తెలుగు సీజన్-7 ప్రారంభం
ఖుషి ప్రమోషన్స్ కోసం వచ్చిన విజయ్ దేవరకొండ
సమంత అమెరికాలో ఉందని వెల్లడి
ఈసారి బిగ్ బాస్ ఇంట్లోకి కేవలం 14 మంది కంటెస్టెంట్లు
బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో సీజన్-7 అట్టహాసంగా ప్రారంభమైంది. హోస్ట్ నాగార్జున కంటెస్టెంట్లందరినీ హౌస్ లోకి పంపించి లాక్ చేసేశారు. మొత్తం 14 మంది కంటెస్టెంట్లు బిగ్ బాస్ ఇంట్లో ప్రవేశించారు.
కాగా, బిగ్ బాస్-7 ప్రారంభ ఎపిసోడ్ లో టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ సందడి చేశారు. ఖుషి చిత్రం ప్రమోషన్స్ కోసం వచ్చిన విజయ్ దేవరకొండ తనదైన శైలిలో ఆడియన్స్ ను అలరించారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ, సమంత ఎక్కడుందని విజయ్ దేవరకొండను ప్రశ్నించారు. సమంత అమెరికాలో ఉందని, అక్కడి ఖుషి ప్రీమియర్స్ కు ప్రమోషన్స్ చేస్తోందని, అంతేగాకుండా, అనారోగ్యానికి చికిత్స చేయించుకుంటోందని విజయ్ దేవరకొండ వెల్లడించారు. ఖుషి చిత్రంలో ఎవరు ఎవరిని డామినేట్ చేశారని నాగ్ ప్రశ్నించగా, భార్యను ఎప్పుడూ భర్త డామినేట్ చేయలేడని విజయ్ దేవరకొండ బదులిచ్చారు. అనంతరం, విజయ్ దేవరకొండను నాగ్ బిగ్ బాస్ ఇంట్లోకి పంపి, కంటెస్టెంట్లకు ఫర్నిచర్ అందించే టాస్క్ ను నిర్వహించారు.
బిగ్ బాస్ సీజన్-7 కంటెస్టెంట్లు వీరే…
1. ప్రియాంక జైన్
2. శివాజీ
3. దామిని భట్ల
4. ప్రిన్స్ యావర్
5. శుభ శ్రీ
6. షకీలా
7. ఆటా సందీప్
8. శోభా శెట్టి
9. టేస్టీ తేజా
10. రతిక
11. గౌతమ్ కృష్ణ
12. కిరణ్ రాథోడ్
13. పల్లవి ప్రశాంత్
14. అమర్ దీప్ చౌదరి
ఇక చివరగా, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా ప్రమోషన్స్ కోసం నవీన్ పొలిశెట్టి బిగ్ బాస్ వేదికపైకి వచ్చాడు. నవీన్ పొలిశెట్టితో సంభాషణ అనంతరం నాగ్ అతడిని బిగ్ బాస్ ఇంట్లోకి పంపించి లాక్ చేసేశాడు. నవీన్ పొలిశెట్టి పరిస్థితి ఏంటన్నది రేపటి ఎపిసోడ్ లో చూడాల్సిందే. కాగా, ఈసారి కేవలం 14 మంది కంటెస్టెంట్లనే హౌస్ లోకి పంపించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. గత సీజన్లలో 20 మంది వరకు కంటెస్టెంట్లను హౌస్ లో కంపిన సందర్భాలు ఉన్నాయి.