ముంబై: నటి సమంత ఇటీవల ఓ అభిమాని డేటింగ్ చేయమన్నందుకు బదులిస్తూ ట్వీట్ చేసింది. నిన్న స్రవంతి సిఎం అనే ట్విట్టర్ యూజర్ సమంతకు అనుకోని సూచన చేసింది. ‘చెప్పేంత స్థాయి నాది కాదని తెలుసు. కానీ దయచేసి ఎవరితో అయినా డేటింగ్ చేయి’ అని ట్వీట్ చేసింది. అయితే దానికి సమంత తగురీతిలో జవాబిచ్చింది. ‘మీ అంతలా నన్ను ఎవరు ప్రేమిస్తారు?’ అని రీట్వీట్ చేసింది. దీంతో ఆమె చాలా మంది హృదయాలు గెలుచుకుంది. సమంత, నాగచైతన్య 2021లో విడిపోయినప్పటికీ వారి మధ్య ఇంకా ఏదో తెగని బంధం ఉందనిపిస్తోంది.
వైవాహిక బంధం నుంచి విడిపోయి ఒంటరి అయిన సమంత తన ధ్యాసంతా సినిమాలపైనే నిలిపింది. ఆమె ‘శాకుంతలం’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. బహుశా అది ఏప్రిల్ 14న విడుదల కానుంది. ఆ సినిమాకు గుణశేఖర్ దర్శకత్వం వహించారు. అందులో దేవ్ మోహన్ లీడ్ రోల్‌లో నటించారు.