సంగారెడ్డి: జిల్లాలోని గుమ్మడిదలలో విద్యుత్ వైర్ల చోరికి పాల్పడుతున్న దొంగను రైతులు చితకబాదారు. గత కొన్ని రోజులుగా రైతుల బోర్ల దగ్గర చోరీకి గురవుతుండటంతో రైతులకు విద్యుత్ వైర్లు ఎవరూ దొంగిలిస్తున్నారా అనేది తెలియక ప్రశ్నార్థకంగా మారింది. దీంతో ఎట్టకేలకు విద్యుత్ వైర్లు ఎత్తుకెళ్తున్న దొంగను పట్టుకుని రైతులు ఆగ్రహంతో చితకబాదారు. రైతుల చేతిలో తీవ్రగాయాల పాలైన మల్లేశం(29) అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. మృతుడికి భార్య, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. గ్రామస్థులు పలుమార్లు హెచ్చరించిన తీరు మారకపోవడంతో రైతులు కొట్టి చంపారు.