రాహుల్ గాంధీపై అనర్హత వేటు దుర్మార్గమైన చర్య అని జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి అన్నారు. ఆదివారం సీపీఐ కార్యాలయంలో(CPI Office) మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘మోదీ(Modi) అధికారంలోకి వచ్చాక ఆర్ఎస్ఎస్(RSS) అడుగు జాడల్లో నడుస్తున్నారు. ఎనిమిదేళ్లలో ప్రతిపక్షాలు లేని దేశాన్ని ప్రజాస్వామ్యం కోరుతున్నారు. కానీ.. ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని పాతర వేస్తున్నారు. తొమ్మిది రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చారు. వందల కోట్లు ఎమ్మెల్యేలకు ఇచ్చి కొంటున్నారు. ప్రశ్నిస్తే కేసులతో వేధిస్తూ..ఈడీ, ఐటీ, సీబీఐలతో దాడులు చేయిస్తున్నారు. రాజకీయాలు కలుషితం అయ్యాయి. 20 ఏళ్ల క్రితం నేరపూరిత చరిత్ర కలిగిన వాళ్లే రాజకీయాల్లో ఉండేవారు, నేడు నేరస్తులే రాజకీయాలు చేస్తున్నారు. ఎవరి వల్ల అదాని రూ.13 లక్షల కోట్లకు ఎదిగారు.. కేవలం మోదీ వల్లే ఎదిగారు. రాహుల్ పై(Rahul) అనర్హత వేటు(disqualified) దుర్మార్గమైన చర్య ఇది. ఏప్రిల్ 14 నుంచి బీజేపీ(BJP) కో హఠావో.. దేశ్ కి బచావో కార్యక్రమం’’ నిర్వహించనున్నట్లు చాడ తెలిపారు.
తెలంగాణరాష్ట్రంలో పెను సంచలనం రేపిన మరొకటి టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ(TSPSC Paper Leakage)..‘‘ టీఎస్పీఎస్సీలో పారదర్శకత కొరవడింది. అనూహ్యరీతిలో పేపర్ లీకేజీ. 30 లక్షల యువత జీవితాలతో చెలగాటం ఆడారు. ఇలాంటి లోపాలు మళ్ళీ జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలి. పేపర్ లికేజీపై సీఎం కేసీఆర్(Cm kcr) తక్షణమే స్పందించాలి’’ అని చాడ వెంకట్ రెడ్డి(Chada Venkat Reddy) డిమాండ్ చేశారు.