వారి మాయమాటలు నమ్మవద్దు
విపక్ష పార్టీలపై సీఎం కేసీఆర్ ఫైర్
గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం రూ. 10 లక్షల చొప్పున సీఎం నిధులను అందిస్తున్నట్లుగా తెలిపారు సీఎం కేసీఆర్. సూర్యాపేటలో సూర్యాపేట కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం, వైద్య కళాశాలను ప్రారంభించిన అంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. మానవభివృద్ధి సూచికలో రాష్ట్రం మంచి స్థానంలో ఉండటం గర్వకారణం అన్నారు. తలసరి ఆదాయం, విద్యుత్ వినియోగంలో అగ్రస్థానంలో ఉందన్నారు. రూ.100 కోట్లతో పరిపాలన భవనాలు నిర్మించుకున్నామన్నారు. ఇప్పటికే ఎన్నో తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చుకున్నామన్నారు.
సూర్యాపేట జిల్లాపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వరాల జల్లు కురిపించారు. గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం రూ. 10 లక్షల చొప్పున సీఎం నిధులను అందిస్తున్నట్లుగా తెలిపారు సీఎం కేసీఆర్. సూర్యాపేటలో సూర్యాపేట కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం, వైద్య కళాశాలను ప్రారంభించిన అంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. మానవభివృద్ధి సూచికలో రాష్ట్రం మంచి స్థానంలో ఉండటం గర్వకారణం అన్నారు. తలసరి ఆదాయం, విద్యుత్ వినియోగంలో అగ్రస్థానంలో ఉందన్నారు. రూ.100 కోట్లతో పరిపాలన భవనాలు నిర్మించుకున్నామన్నారు. ఇప్పటికే ఎన్నో తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చుకున్నామన్నారు.
ఏం చేశారో చెప్పండి..
50 ఏళ్లు కాంగ్రెస్‌కు పార్టీకి అవకాశం ఇచ్చినా ఏం చేశారని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. సూర్యాపేట, భువనగిరి, నల్గొండలో మెడికల్ కాలేజీలు పెట్టాలని ఎప్పుడైనా అనుకున్నారా..సూర్యాపేట, నల్గొండ గతంలో ఎలా ఉన్నాయో మనం చూశామో చెప్పాలని అడిగారు. ఇప్పుడెలా ఉన్నాయి.. రైతు చనిపోతే ఆపద్భందు పేరుతో ఆర్నెళ్లకు రూ.50 వేలు ఇచ్చేవారు. అంచెలంచెలుగా సంక్షేమ పథకాల నిధులు పెంచుకుంటూపోతున్నామన్నారు. 50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ మరో అవకాశం కావాలని అడుగుతోందని ఎద్దేవ చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ పాలిస్తున్న రాష్ట్రాల్లో రూ.4 వేల పింఛను ఎందుకు ఇవ్వట్లేదో చెప్పాలని అన్నారు.