జస్ప్రీత్ బూమ్రా సారథ్యంలో 3 టీ20 మ్యాచ్‌ల సిరీస్ కోసం ఐర్లాండ్ వెళ్లిన టీమిండియా ఖాతాలో మరో టీ20 సిరీస్ చేరింది. శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్‌లో 2 పరుగుల తేడాతో గెలిచిన బూమ్రా సేన, నేటి రెండో టీ20లో తేడాతో ఐర్లాండ్‌పై విజయం సాధించింది. దీంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే టీ20 మ్యాచ్‌ను 2-0 తేడాతో టీమిండియా గెలుచుకుంది. అలాగే బూమ్రాకి టీ20 టీమ్ కెప్టెన్‌గా ఇది తొలి సిరీస్, ఇంకా తొలి సిరీస్ విజయం కావడం విశేషం. మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 185 పరుగులు చేయగా, ఐరీష్ బ్యాటర్లు 152 పరుగులకే పరిమితమయ్యారు. దీంతో భారత్ 33 పరుగుల తేడాతో రెండో విజయం సాధించింది.
అంతకముందు టాస్ గెలిచిన ఐర్లాండ్.. తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కి దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 185 పరుగుల భారీ మొత్తాన్ని సాధించారు. ఈ క్రమంలో భారత్ తరఫున రుతురాజ్ గైక్వాడ్(58) హాఫ్ సెంచరీతో రాణించగా.. సంజూ శామ్సన్ 40, రింకూ సింగ్ 38, శివమ్ దుబే అజేయంగా 22 పరుగులతో ఆకట్టుకున్నారు. ఐరీష్ బౌలర్లలో బారీ మెక్‌కార్తీ 2 వికెట్ల తీయగా.. క్రైయిగ్ యంగ్, బెంజమిన్ యంగ్, మార్క్ అడైర్ తలో వికెట్ పడగొట్టారు. అయితే అనంతరం 186 పరుగుల లక్ష్యంతో ఐర్లాండ్ తరఫున బరిలోకి దిగిన అండ్రూ బల్బిర్నీ 72 పరుగులతో రాణించాడు. కానీ తొటి ప్లేయర్లు నుంచి సహాయం లభించకపోవడంతో అతని శ్రమ వృథా అయిపోయింది. చివర్లో మార్క్ అడైర్ మూడు సిక్సర్లతో 23 పరుగులు చేసినా ఫలితం లేకపోయింది. భారత బౌలర్లలో బూమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, రవి బిష్ణోయ్ తలో రెండేసి వికెట్లు తీసుకోగా… అర్ష్‌దీప్ ఓ వికెట్ పడగొట్టాడు.