గోల్కొండ కోటపై జాతీయ జెండా రెపరెపలాడింది. 77వ స్వాంతంత్య్ర దినోత్సవం సందర్భంగా కోటలోని రాణిమహల్ ప్రాంగణంలో సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఎగురవేశారు. అంతకుముందు కేసీఆర్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ నుంచి గోల్కోండకు చేరుకున్న సీఎం కేసీఆర్‌కు.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్, హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్, కళాకారులు ఘన స్వాగతం పలికారు. అంతకుముందు ముఖ్యమంత్రి కేసీఆర్.. సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో ఉన్న సైనిక వీరుల స్మారకం వద్ద అమరజవాన్లకు నివాళులర్పించారు.