AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మోదీ, అమిత్‌ షాల కుట్రే: భట్టి విక్రమార్క

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ పార్లమెంటు సభ్యత్వంపై అనర్హత వేటు వేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. పీపుల్స్‌ మార్చ్‌ పోరుయాత్రలో భాగంగా చేపట్టిన పాదయాత్ర తొమ్మిదవ రోజుకు చేరుకుంది. కొమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని వాడిగూడలో పాదయాత్ర సందర్భంగా భట్టి మీడియాతో మాట్లాడారు. రాహుల్‌ గాంధీపై బహిష్కరణ వేటు ప్రజాస్వామ్యంపై జరుగుతున్న దాడిగా భావిస్తున్నామన్నారు.

దీన్ని ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సామ్యవాదం పైన జరుగుతున్న కుట్రగా చూడాలని అభిప్రాయపడ్డారు. రాహుల్‌ గాంధీ పై తప్పుడు కేసులు పెట్టి సూరత్‌ కోర్టులో శిక్ష వేయించి బీజేపీ ప్రభుత్వం న్యాయవ్యవస్థను పక్కదారి పట్టించిందని ఆరోపించారు. మతతత్వ ఫాసిస్టు బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ఈ దాడిని ఖండిస్తున్నామన్నారు. సామ్యవాదులు, లౌకికవాదులు, ప్రగతిశీలవాదులు, ప్రజల సంపద ప్రజలకే చెందాలని కోరుకునే వాళ్ళు రాహుల్‌ గాంధీ బహిష్కరణ వేటును ముక్తకంఠంతో ఖండిరచాలని పిలుపునిచ్చారు. రాహుల్‌ గాంధీ వెన్నంటి కోట్లాదిమంది ఉన్నారని మోదీ సర్కార్‌ గ్రహించాలని గుర్తు చేశారు. ఈ దేశం లౌకికవాదంతో ముందుకెళ్లాలని కన్యాకుమారి నుంచి కాశ్మీర్‌ వరకు పాదయాత్ర చేసిన అసలు సిసలైన ప్రజాస్వామిక వాది రాహుల్‌ గాంధీ అని అభివర్ణించారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10