టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. పేపర్ లీకేజీ ఘటన దురదృష్టకరమని తెలిపారు. పేపర్ లీకేజీపై విచారణ కొనసాగుతుందని సబితాఇంద్రారెడ్డి వెల్లడించారు. ఈ కేసులో ఎంతటి వారున్న వదలమన్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా సీఎం కేసీఆర్ కఠిన చర్యలు తీసుకుంటారని మంత్రి స్పష్టం చేశారు. అటు తెలంగాణలో పేపర్ లీకేజీపై ఉస్మానియా యూనివర్సీటీలో శనివారం విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. ఓయూ లైబ్రరీ నుంచి ఆర్ట్స్ కళాశాల వరకు ఎబివిపి నాయకులు పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించారు.