కళ్లలో కారంపొడి చల్లి కర్రలతో దాడి..
కామారెడ్డి జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. భూతగాదాల నేపథ్యంలో జరిగిన ఘర్షణలో పలువురు గాయపడ్డారు. కామారెడ్డి మండలం లింగాయిపల్లి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. భూ తగాదాలతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగాయి. ఓ భూమి విషయంలో ఇరు వర్గాలు పరస్పరం దాడులకు పాల్పడ్డారు. ఓ వర్గంపై మరో వర్గం కారంపొడి, కర్రలతో దాడులు చేశారు. ఈ దాడిలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గత కొద్ది నెలలుగా ఓ భూమి విషయంలో ఇరువర్గాల మధ్య గొడవ జరుగుతోంది. ఈ క్రమంలో తోట లింగం కుటుంబానికి చెందిన వ్యక్తులు కళ్లలో కారంపొడి చల్లి కర్రలతో దాడి చేయడంతో పోచయ్య, రాజయ్య, సిద్దవ్వ, లక్ష్మి, అంజయ్య అనే వ్యక్తులకు గాయాలయ్యాయి. వెంటనే వారిని హుటాహుటిన ఆస్పత్రకి తరలించి చికిత్స అందజేశారు. సమాచారం అందిన వెంటనే దేవునిపల్లి పోలీసులు అక్కడకు చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. దాడి చేసిన లింగం కుటుంబ సభ్యులపై దేవునిపల్లి పోలీస్ స్టేషన్‌లో బాధితులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.