టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజ్ (TSPSC Leakage)కు సంబంధించి ఓయూ విద్యార్థుల (OU Students)కు మద్దతుగా నిలిచిన కాంగ్రెస్ నేతల (Congress Leaders)ను రెండో రోజు కూడా పోలీసులు అడ్డుకుంటున్నారు. నిన్న కాంగ్రెస్ సీనియర్ నేతలను హౌస్ అరెస్ట్ (House Arrect) చేసిన పోలీసులు ఈరోజు కూడా అదే తీరును కొనసాగిస్తున్నారు. పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్‌ను గృహనిర్బంధం చేశారు. అలాగే టీపీసీసీ చీఫ్ రేవంత్ (TPCC Chief Revanth reddy) ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు.
నిన్న నిరుద్యోగ మహాదీక్షకు రేవంత్ హాజరుకావడంపై రేవంత్ ఇంటి వద్ద టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. దీక్షకు ముఖ్య అతిథిగా హాజరై రేవంత్ సంఘీభావం తెలపాలని టీపీసీసీ చీఫ్ నిర్ణయించారు. అయితే ఈ దీక్షకు అనుమతి లేదంటూ.. రేవంత్ ఉస్మానియా యూనివర్సిటీకి (Osmania University) వెళ్ళకుండా పోలీసులు గృహనిర్బంధం చేశారు. ఆయన ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. రేవంత్ ఇంటికి వెళ్లే దారులన్నీ మూసేశారు. రేవంత్ ఇంటికి ఎవరూ రాకుండా పోలీసులు అడ్డుకున్నారు.