హైదరాబాద్: లోక్‌సభ నుంచి రాహుల్ గాంధీని అనర్హుడిని చేయడంపై, రాహుల్ గాంధీపై గుజరాత్ కోర్టు తొందరపాటుతనంతో శిక్ష విధిస్తూ తీర్పునివ్వడంపై మంత్రి కె. తారక రామారావు(కేటీఆర్) స్పందిస్తూ ట్వీట్ చేశారు. రాహుల్ గాంధీని లోక్‌సభ నుంచి అనర్హుడిగా ప్రకటించడం రాజ్యాంగానికి తప్పుడు భాష్యం చెప్పడమేనన్నారు. ఈ తొందరపాటు తీర్పు అప్రజాస్వామికం, నేను దీనిని ఖండిస్తున్నాను అని కేటీఆర్ స్పందించారు.