మంచు మనోజ్ పై విష్ణు దాడి! వీడియో వైరల్
మంచు విష్ణు – మంచు మనోజ్ మధ్య విబేధాలు ఉన్నాయంటూ గత కొన్ని రోజులుగా బోలెడన్ని వార్తలు షికారు చేస్తున్నాయి. మంచు ఫ్యామిలీలో లోలోపల చాలా గొడవలు జరుగుతున్నాయనే టాక్ ఫిలిం నగర్ లో కొంతకాలంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా బయటకొచ్చిన ఓ వీడియో సంచలనంగా మారింది.
ఏకంగా మంచు విష్ణు తమ్ముడు మనోజ్ పై దాడికి పాల్పడినట్లు ఈ వీడియో స్పష్టం చేస్తోంది. విష్ణు బంధువుల ఇంట్లోకి వెళ్లి మరీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇదీ ఇలాగా బంధువుల ఇళ్లలోకి వచ్చి మావాళ్లను, బంధువులను కొడుతుంటారండీ, ఇది సిట్యూయేషన్ అంటూ ఈ వీడియోలో మనోజ్ వాయిస్ వినిపిస్తుండటంతో మంచు వారింట జరుగుతున్న గొడవ బట్టబయలైంది. వీడియోను మంచు మనోజ్ స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాలో పెట్టడంతో కలకలం రేగింది. తన మనిషి సారధిని విష్ణు కొట్టాడంటూ మనోజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తరచూ ఇంట్లోకి చొరబడి ఇలా కొడుతూ ఉంటాడంటూ విష్ణు పై మనోజ్ సీరియస్ కావడం హాట్ టాపిక్ అయింది.