AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కాంగ్రెస్ నేతల హౌజ్ అరెస్ట్

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ (TSPSC Paper Leakage) వ్యవహారంలో చేసిన ఆరోపణలపై ఆధారాలు సమర్పించాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy)కి సిట్ (SIT) నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో మరికాసేటపట్లో రేవంత్ (TPCC Chief) సిట్ ముందు హాజరకానున్నారు. ఈ నేపథ్యంలో పలువురు కాంగ్రెస్‌ నేతల (Congress Leaders)ను పోలీసులు హౌజ్ అరెస్ట్‌ (House Arrest)లు చేస్తున్నారు. పెద్ద ఎత్తున నేతలు, కార్యకర్తలు సిట్ కార్యాలయానికి తరలివచ్చే అవకాశం ఉందని.. ఇదే జరిగితే గందరగోళ పరిస్థితి నెలకొన్న పరిస్థితి ఉందని గ్రహించిన పోలీసులు ముందుస్తుగానే కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడ హౌజ్ అరెస్ట్‌లు చేస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ, మల్లు రవి (Mallu Ravi) సహా పలువురు అగ్రనేతలను గృహనిర్బంధం చేశారు.

హైదరాబాద్‌ (Hyderabad)తో పాటు జిల్లాలో కూడా కాంగ్రెస్ నేతలను హౌజ్ అరెస్ట్ చేశారు. అయినప్పటికీ రేవంత్ రెడ్డి సిట్ విచారణకు హాజరుకాబోతున్న నేపథ్యంలో చాలా మంది కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు రేవంత్ నివాసానికి చేరుకుంటున్నారు. అటు సిట్ కార్యాలయం వద్ద కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అయితే టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజ్‌తో ఆందోళనలో ఉన్న విద్యార్థులకు భరోసా కల్పించాల్సిన ప్రభుత్వం.. ఈ విషయంపై మాట్లాడుతున్న ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. ప్రతిపక్షాలకు సిట్ నోటీసులు ఇవ్వడాన్ని కాంగ్రెస్ తప్పుబడుతోంది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10