TSPSC పేపర్ లీకేజ్ కేసులో మంత్రి కేటీఆర్ పీఏ తిరుపతి(PA Tirupati) పాత్రపై దర్యాప్తు జరిపించాలని హైకోర్టులో(High Court) బల్మూరు వెంకట్‌తో పాటు మరో ఇద్దరు అభ్యర్థులు అఫిడవిట్(Affidavit) దాఖలు చేశారు. TSPSC పేపర్ లీకేజ్ కేసులో ఇప్పటికే సీబీఐ(CBI) దర్యాప్తు జరిపించాలని వెంకట్ పిటిషన్ వేశారు. అయితే..గ్రూప్-1 పేపర్లో ఒకే జిల్లాకు చెందిన 20 మందికి అధిక మార్కులు రావడం అనుమానాలు ఉన్నాయని పిటిషన్లో(Petition) పేర్కొన్నారు. కేటీఆర్(KTR) మీడియా సమావేశం ఏర్పాటు చేయడం అనుమానాలకు తావు ఇస్తుందని పిటిషన్లో తెలిపారు. TSPSC పేపర్ లీకేజ్‌లో కేటీఆర్ పీఏ తిరుపతిఫై దర్యాప్తు జరిపించాలని పిటిషనర్స్ అఫిడవిట్ దాఖలు చేశారు. రేపు పిటిషన్ తరపు వాదనలను నేషనల్ కాంగ్రెస్ లీగల్ సెల్ ప్రెసిడెంట్ వివేక్ ధన్కా(Vivek Dhanka) వినిపించునున్నారు. పిటిషన్‌ఫై హైకోర్టు రేపు విచారణ జరుపనుంది.