తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజ్ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు… తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి నోటీస్ పంపారు. ఈ కేసులో పేపర్ లీకేజీలకు సంబంధించి ఆయన చేసిన ఆరోపణలకు తగిన ఆధారాలు సమర్పిస్తే… ఆ దిశగా దర్యాప్తు చేస్తామని ఏసీపీ స్థాయి అధికారి రేవంత్ రెడ్డికి నోటీస్ పంపారు. రేవంచత్ రెడ్డి.. నిన్న ఈ ఆరోపణలు చేశారు. మంత్రి కేటీఆర్ సొంత మండలంలో గ్రూప్ 1 పరీక్ష రాసిన వారిలో చాలా మందికి 100కు పైగా మార్కులు వచ్చాయని.. ఇది అనుమానాలకు తావిస్తోందని రేవంత్ రెడ్డి అన్నారు.
ఎవరెవరికి 100కు పైగా మార్కులు వచ్చాయి? ఆ మార్కులు పొందిన వారు ఎవరు? అన్న వివరాలు సమర్పించాలని సిట్ అధికారులు నోటీసులో కోరినట్లు తెలిసింది. రేవంత్ రెడ్డితోపాటూ.. ఇలా ఆరోపణలు చేసిన నేతలకు సిట్ అధికారులు నోటీసులు పంపిస్తున్నట్లు తెలుస్తోంది.