ఖమ్మం మార్కెట్ లో రికార్డ్ స్థాయిలో మిర్చి ధర
ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో తేజ రకం కొత్త మిర్చికి రికార్డు స్థాయిలో ధర పలికింది. ఖమ్మం మార్కెట్ చరిత్రలో అత్యధికంగా క్వింటాల్ మిర్చికి రూ. 25 వేల 550 పలకడం ఇదే ప్రథమం. ఖమ్మం మార్కెట్ ను అంతర్జాతీయ మార్కెట్ కు చిరునామాగా తీర్చిదిద్దుతామని .. చిల్లీస్ కు హబ్ గా మారుస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. ఖమ్మం వ్యవసాయ మిర్చి మార్కెట్ లో నిర్వహించిన జెండా పాటలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ పాల్గొని జెండా పట్టి ధర నిర్ణయించారు. ఖమ్మం మిర్చి మార్కెట్ లో రికార్డు స్థాయిలో ధర పలికిందని మంత్రి పేర్కొన్నారు. కొన్ని క్వింటాలే కాదు…రైతులు పండించిన ప్రతి బస్తాలను కొనుగోలు చేస్తామన్నారు. ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక వ్యవసాయం లాభసాటిగా మారిందని చెప్పారు.