టీఎస్ పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంలో ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షులు బల్మూరి వెంకట్ దాఖలు చేసిన పిటిషన్ విచారణను హైకోర్ట్ మార్చి 21కి వాయిదా వేసింది.పేపర్ లీక్ కేసును సీబీఐకి లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలంటూ బల్మూరి వెంకట్ హైకోర్ట్ లో పిటిషన్ వేశారు. విచారణ సందర్భంగా .. మార్చి 21కి పిటిషన్ ను వాయిదా వేయాలని బల్మూరి వెంకట్ తరపు న్యాయవాది కరుణాకర్ కోర్టును కోరారు. సుప్రీం కోర్టు న్యాయవాది కాంగ్రెస్ లీగల్ సెల్ అధ్యక్షులు వివేక్ ధన్కా వాదనలు వినిపిస్తారని కోర్టుకు తెలిపారు. దీంతో పిటిషన్ విచారణను ధర్మాసనం వాయిదా వేసింది. ఇదే కేసులో నిరుద్యోగులు వేసిన పిటిషన్ ను మార్చి 21కి వాయిదా వేసింది.