ప్రగతిభవన్‌కు పిలిపించుకుని పేపర్ల లీకేజీపై ఆరా
బోర్డు నిర్లక్ష్యానికి ప్రభుత్వం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందంటూ మండిపాటు
పేపర్ల లీకేజీ వ్యవహారంపై కేసీఆర్ టీఎస్‌పీఎస్సీ బోర్డు ఛైర్మన్ జనార్దన్‌రెడ్డిపై తీస్థ్రాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. జనార్దన్‌రెడ్డిని ప్రగతిభవన్ కు పిలిపించుకుని పేపర్ల లీకేజీ వ్యవహారంపై వివరణ అడిగినట్లు సమాచారం. ఎంతో పకడ్బందీగా జరగాల్సిన ప్రవేశపరీక్షలు ఎందుకింతగా వివాదాస్పదమయ్యాయో సమాధానం చెప్పాలని నిలదీశారు. బోర్డు నిర్లక్ష్యం కారణంగానే ఇపుడు ప్రభుత్వం తలదించుకోవాల్సిన పరిస్ధితులు ఏర్పడినట్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారని సమాచారం. బోర్డు నిర్లక్ష్యానికి ప్రభుత్వం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందంటూ ఆక్షేపించినట్లు వినికిడి.
పరీక్షలు రాసిన వేలాదిమంది నిరుద్యోగులకు ఎవరు సమాధానం చెప్పాలని చైర్మన్‌ను కేసీఆర్ నిలదీసినట్లు సమాచారం. అందరు కలిసి ప్రభుత్వం పరువును తీసేశారంటు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారట. కేసీఆర్ ఆగ్రహం చూసిన తర్వాత ఛైర్మన్ కు ఏమిచెప్పాలో దిక్కుతోచలేదట. పేపర్ల లీకేజీ వ్యవహారానికి సంబంధించిన వివరాలను కేసీఆర్ కు చైర్మన్ వివరించినట్లు తెలుస్తోంది.
అయితే ప్రతిపక్షాలేమో మంత్రి కేటీఆర్ ను నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి లేదా బర్త్ రఫ్ చేయాలని కేసీఆర్‌ను డిమాండ్ చేస్తున్నాయి. ఇదే సమయంలో నిరుద్యోగులేమో టీఎస్ పీఎస్సీ బోర్డును రద్దుచేయాలని గోలగోల చేస్తున్నాయి. రెండిరటిలో ఏది జరుగుతుంది అనుకుంటే ముందు బోర్డు చైర్మన్ రాజీనామా కే అవకాశముందని పార్టీ వర్గాలు చెప్పాయి. సమస్యంతా టీఎస్ పీఎస్సీ బోర్డులోనే ఉంది కనుక ముందు చైర్మన్ జనార్దనరెడ్డి పైనే వేటు పడటం ఖాయమనే ప్రచారం జరుగుతోంది.