AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కష్టాల్లో టీమిండియా

విశాఖపట్నం వేదికగా భారత్,ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతోన్న రెండో వన్డే మ్యాచ్ లో టీమిండియా కష్టాల్లో పడింది. 16 ఓవర్లు ముగిసే టైమ్ కు 6 వికెట్లు కోల్పోయి 71 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్లో అక్షర్ పటేల్ (0), రవీంద్ర జడేజా (12) పరుగులతో ఉన్నారు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆదిలోనే గిల్‌ వికెట్‌ కోల్పోయింది. తొలి ఓవర్‌ మూడో బంతికే గిల్‌(0).. లబుషేన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తరువాత ఐదో ఓవర్‌ నాలుగో బంతికి స్టార్క్‌ బౌలింగ్‌లో రోహిత్‌(13).. స్మిత్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగగా, ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్య తర్వాతి బంతికే ఎల్బీగా వెనుదిరిగాడు.

ఆ తరువాత స్టార్క్‌ బౌలింగ్‌లోనే కేఎల్ రాహుల్ (9) ఎల్బీగా పెవిలియన్‌కు చేరాడు. అనంతరం స్వల్ప వ్యవధిలో భారత్‌ మరో వికెట్‌ను కోల్పోయింది. సీన్‌ అబాట్ బౌలింగ్‌లో (9.2వ ఓవర్) స్టీవ్‌ స్మిత్ అద్భుతమైన క్యాచ్‌ పట్టడంతో హార్దిక్‌ పాండ్య (1) ఔటయ్యాడు. అనంతరం నిలకడగా ఆడుతూ కనిపించిన విరాట్ కోహ్లీ (31) కూడా పెవిలియన్‌కు చేరాడు. ఎల్లిస్‌ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. దీంతో వరుస వికెట్లును కోల్పోయి టీమిండియా కష్టాల్లో పడింది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10