తిరుపతి జిల్లాలో దారుణం జరిగింది. ఓ తల్లి తన ఇద్దరు కుమారులను చంపి ఆత్మహత్యకు పాల్పడింది. జిల్లాలోని శ్రీకాళహస్తి ఈదులగుంట కాలనీలో జరిగిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కాలనీలో నివాసముంటున్న శివమ్మ, శివయ్య అనే దంపతులకు ఇద్దరు కుమారులు లోహితేశ్వర్, దేవ ఉన్నారు. గత కొన్నాళ్లుగా వీరిద్దరి మధ్య కుటుంబ కలహాలతో ఘర్ణణకు పాల్పడుతున్నారు.
శుక్రవారం తల్లి శివమ్మ తన ఇద్దరు కొడుకులను చంపి ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించి మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. భర్త శివయ్యను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనకు కుటుంబ కలహాలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.